ముగ్గురు బైక్ దొంగలు అరెస్ట్

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-24 11:15:01  IST  )

గత కొంత కాలంగా ద్విచక్రవాహనాలు దొంగిలించి జల్సాలకు పాల్పడుతున్న మైనర్ దొంగలను బుధవారం కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు.

ముగ్గురు బైక్ దొంగలు అరెస్ట్
X

ముగ్గురు బైక్ దొంగలు అరెస్ట్

-13 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు

-ముగ్గురు యువకులపై కేసు నమోదు..

దిశ, కరీంనగర్ రూరల్ : గత కొంత కాలంగా ద్విచక్రవాహనాలు దొంగిలించి జల్సాలకు పాల్పడుతున్న మైనర్ దొంగలను బుధవారం కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులు క్వాదాసి వికాస్, తండ్ర సిద్ధు, బోయిని శివ సాయిని అదుపులోకి తీసుకుని విచారించగా 13 వాహనాలు చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. విచారణ అనంతరం 13 వాహనాలను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు.చాకచక్యంగా నిందితులను పట్టుకున్న సీఐ నిరంజన్ రెడ్డిని, ఎస్ఐలు లక్ష్మా రెడ్డి, నరేష్, ఏఎస్ఐ అంజద్ ను సీపీ గౌస్ ఆలం, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు.....

Next Story