- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగల హల్ చల్.. ఐదు ప్రాంతాల్లో చోరీ..!
గుర్తు తెలియని వ్యక్తి పలు దొంగతనాలకు పాల్పడటంతో మాల్యాల ప్రాంత వాసులు, వ్యాపారులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

దిశ, మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ఎక్స్ రోడ్ ప్రాంతంలో చోరీ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి యథెచ్చగా దొంగతనాలకు పాల్పడడం ప్రాంత వాసులను, వ్యాపారులు తీవ్రంగా బెంబేలెత్తారు. ఎక్స్ రోడ్ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజూ అర్థరాత్రి ఐదు ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఇంటి భోజనం హోటల్, చిచా చాయ్ టీ షాప్ చెన్న మురళీ కి చెందిన పాన్ షాప్, లక్కీ క్రికెట్ బాక్స్ ఆఫీసులో తాళం పగలగొట్టి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. మల్యాలకు చెందిన బుధరపు జితేందర్ హెచ్ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనం దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించినప్పటికీ ఒకే రోజు ఐదు చోట్ల దొంగతనం జరగడం కలకలం రేపింది. దొంగతనాలకు తావు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.






