- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతికి ఉండగానే నన్ను చంపేశారు.. బాధితుడి ఆవేదన
అధికారుల దృష్టిలో నన్ను చంపేసిన సృష్టిలో మాత్రం నేను ఇంకా బతికే ఉన్నా అంటూ ఓ బాధితుడు కన్నీరు పెట్టుకున్నాడు.

దిశ,రామడుగు : అధికారుల దృష్టిలో నన్ను చంపేసిన సృష్టిలో మాత్రం నేను ఇంకా బతికే ఉన్నా అంటూ ఓ బాధితుడు కన్నీరు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన చిలుముల లింగయ్య అనే వ్యక్తి బ్రతికి ఉండగానే తనను చనిపోయిన కింద నమోదు చేసి నా పెన్షన్ రాకుండా చేశారంటూ ఆవేదన చెందాడు. వృద్ధాప్య పెన్షన్ కింద గత కొన్ని సంవత్సరాలుగా నేను పెన్షన్ తీసుకున్నప్పటికి ఈ మధ్యకాలంలో నన్ను చనిపోయిన కింద జనాభా లెక్కలో చూపిస్తూ నాకు పెన్షన్ రాకుండా అధికార యంత్రంగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలినాలి చేసుకుని బ్రతికే నాకు పెన్షన్ ఆగిపోవడం వల్ల నాకు ఆధారం లేకుండా పోయిందని బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నాకు ఆసరా పెన్షన్ కింద కార్డు ఇచ్చారని సూచించారు. ఇలా పెన్షన్ కోసం తిరగని కార్యాలయం ముందు లేకుండా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లిన కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారని నాకు వెంటనే పెన్షన్ మంజూరు చేసి నన్ను బ్రతికున్న జనాభా లెక్కల్లో చేర్చాలంటూ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.






