కోతలు మొదలైన.. కొనుగోలు కేంద్రాల జాడేలేదు

by Nallavelli.Anjaneyulu |

శంకరపట్నం మండలంలో వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. మండల పరిధిలో మూడు సహకార సంఘాల పరిధిలో ధాన్యం కొనుగోలు జరుగుతుంది.

కోతలు మొదలైన.. కొనుగోలు కేంద్రాల జాడేలేదు
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలో వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. మండల పరిధిలో మూడు సహకార సంఘాల పరిధిలో ధాన్యం కొనుగోలు జరుగుతుంది. తాడికల్, మెట్పల్లి, గద్దపాక సహకార సంఘాలు రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. శంకరపట్నం మండల వ్యాప్తంగా సాగుచేసిన వరి పంటల కోతలు ప్రారంభమై ధాన్యం మార్కెట్లను చేరుతున్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంలో ఆంతర్యం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేశవపట్నం గ్రామానికి చెందిన కుమార్ అనే రైతు ఐదు రోజుల క్రితం మార్కెట్లో ధాన్యాన్ని ఆరబోసినట్లు తెలిపారు. కాంటాలు ఇంకా ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కాపాడుకోవడానికి కాపలా ఉండాల్సిన పరిస్థితి అని అంతే కాకుండా కోతులు ధాన్యాన్ని చెల్లా చెదురుగా చేస్తున్నాయని తెలిపాడు. వెంటనే కాంటాలు వేస్తే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

ఓ వైపు ఎండలు.. మరోవైపు మబ్బులు

ఇక వరి కోత కోయడమే ఆలస్యం ఒకటి రెండు రోజుల్లోనే ధాన్యం ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతాన్ని పొందుతుందని తెలిపారు. గత రెండు రోజులుగా ఆకాశం మేఘా వృతమై ఉండడంతో రైతన్నలు ఆందోళ‌న చెందుతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల‌ని.. ఆలస్యం చేస్తే నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Next Story