ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

by Disha Web Desk 23 |
ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
X

దిశ, మంథని : మంథని పట్టణ సమీపంలోని చన్నె చెరువులో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన మంగళవారం జరిగింది. బోయిన్ పేటకు చెందిన అక్షయ్, భవాని శంకర్ అనే స్నేహితులు ఈత కొట్టేందుకు చన్నె చెరువులో దిగారు. కాసేపటి తర్వాత భవాని శంకర్ నీటిలో మునిగి గల్లంతు అవగా, అక్షయ్ కుమార్ బయటకు వచ్చినట్లు ఎస్.ఐ. కిరణ్ కుమార్ తెలిపారు. అతని కోసం గాలింపు చేపట్టామని తెలిపారు.

Next Story