- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో విఫలమైన గ్రామ అధికార యంత్రాంగం
మండల పరిధిలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో గ్రామ అధికారిక యంత్రాంగం విఫలమైందని, ఆర్కే "ప్రొటక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్" అసోసియేషన్ ఆల్ ఓవర్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రెటరీ మారుపాక హరీష్ అన్నారు.

దిశ, ఎల్లారెడ్డిపేట : మండల పరిధిలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో గ్రామ అధికారిక యంత్రాంగం విఫలమైందని, ఆర్కే "ప్రొటక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్" అసోసియేషన్ ఆల్ ఓవర్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రెటరీ మారుపాక హరీష్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ సత్తయ్య కు ఫిర్యాదు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించాలని వినతి పత్రాన్ని అందజేశారు. అర్హులైన, ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేయకుండా, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేశారని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు మంజూరైన 38 ఇళ్లు గ్రామంలో ఎవరెవరికి ఇచ్చారు..? ఏ ప్రాతిపదికన వారిని సెలెక్ట్ చేశారని గ్రామ సెక్రెటరీ సంతోష్ ను అడిగితే లిస్ట్ ఇవ్వడం లేదని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు మంజూరు కాకపోవడానికి గల కారణాలు మాకు తెలియాలి అని ప్రశ్నిస్తే.. స్పందించడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శి పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భీమ్ యూత్ వైస్ ప్రెసిడెంట్ తెడ్డు నరేష్, చీఫ్ సెక్రటరీ మిడిదొడ్డి అనిల్, సెక్రటరీ మారుపాక అజయ్, కోశాధికారి మారుపాక ప్రవీణ్ పాల్గొన్నారు






