ద్విచ‌క్ర వాహ‌నం అదుపు త‌ప్పి వ్య‌క్తికి తీవ్ర‌ గాయాలు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-06 12:32:38  IST  )

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం లింగన్నపేట గ్రామ పెద్దమ్మ గుడి మూలమలుపు దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. గంభీరావుపేట్ మండలం

ద్విచ‌క్ర వాహ‌నం అదుపు త‌ప్పి వ్య‌క్తికి తీవ్ర‌ గాయాలు
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం లింగన్నపేట గ్రామ పెద్దమ్మ గుడి మూలమలుపు దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. గంభీరావుపేట్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దమ్మా దేవి రెడ్డి (48) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గంభీరావుపేట్ మండలం కు చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది, ఈఎంటీ (EMT) సత్తయ్య పైలట్ సాయికృష్ణ, త్వరగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు గాయపడిన దమ్మ దేవి రెడ్డి ను అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆలస్యం చేయకుండా బాధితుడిని CHC గంభీరావుపేట్ మండల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దమ్మ దేవి రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.

Next Story