స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి

by Nallavelli.Anjaneyulu |

దిశ, గంగాధర : స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా గంగాధర మండలంలో సర్పంచ్ పదవులు ‘కాస్లీ’గా మారిపోయాయని ప్రజల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా గంగాధర,

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి
X

దిశ, గంగాధర : స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా గంగాధర మండలంలో సర్పంచ్ పదవులు ‘కాస్లీ’గా మారిపోయాయని ప్రజల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా గంగాధర, మధురానగర్, బూరుగుపల్లి, గర్శకుర్తి, గట్టుభూత్కూర్ గ్రామాల్లో ఎన్నికలు సమీపిస్తుంటే అభ్యర్థులు భారీగా ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్రామస్తుల వివరాల ప్రకారం గత సర్పంచ్ ఎన్నికల్లోనే ఆయా గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఈసారి అయితే పరిస్థితులు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామాల ఆదాయ వనరులు పెరగడంతో అభ్యర్థులు కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉందన్నది ప్రస్తుతం స్థానికంగా వినిపిస్తున్న టాక్.

ఎందుకు ఈ భారీ ఖర్చులు అంటే గంగాధర గ్రామంలో వారసంత మండల కేంద్రంలో జరిగే వారసంత ద్వారా యేడాదికి1.5 కోట్ల వరకూ ఆదాయం వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గట్టుభూత్కూర్ గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ క్వారీలద్వారా స్థిరమైన ఆదాయం ఉండటంతో సర్పంచ్ పదవిపై పోటీ భారీగా పెరిగింది. భూముల ధరలు ఆకాశానంటుతున్న గ్రామాలు మధురానగర్, బూరుగుపల్లి, గర్శకుర్తి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వేగంగా పెరుగుతోందని, భూముల విలువలు అధికమవ్వడంతో గ్రామాలకు వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని తెలుస్తోంది. ఈ ఆర్థిక వనరులన్నింటి ప్రభావంతో సర్పంచ్ పదవి స్థానికంగా ‘అధికార ఆర్థిక’ పరంగా ఆకర్షణీయమైపోవడంతో అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. “గ్రామాల్లో ప్రాథమిక సమస్యలు అలాగే ఉన్నాయి... కానీ సర్పంచ్ పదవికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు తిరిగి ఎలా వస్తాయి?” అనే ప్రశ్న స్థానికంగా ఊపందుకుంది. అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రత, పెట్టుబడుల పరంగా పెరిగిన ‘సర్పంచ్ మార్కెట్’పై సోషల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి.

Next Story