జ‌ర్న‌లిస్టు కుటుంబానికి ప్రెస్ క్ల‌బ్ స‌భ్యులు ప‌రామ‌ర్శ

by Nallavelli.Anjaneyulu |

మండలంలోని చీమలకుంట పల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు విభూది వీరకుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విష‌యం తెలిసిందే.

జ‌ర్న‌లిస్టు కుటుంబానికి ప్రెస్ క్ల‌బ్ స‌భ్యులు ప‌రామ‌ర్శ
X

దిశ, గన్నేరువరం : మండలంలోని చీమలకుంట పల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు విభూది వీరకుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. వారి కుటుంబాన్ని డబ్ల్యూజెఐ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల ప్రెస్ క్లబ్ సభ్యులు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాశం ఎల్లయ్య, ఓరగంటి సంపత్, పులి సంతోష్ గౌడ్, భీమనాది వెంకటేష్, వడ్నాల తిరుపతి, జాలి నరేష్ రెడ్డి, నేరెళ్ల నరేష్ గౌడ్ గ్రామ సర్పంచ్ జంగిటి ప్రకాష్ పాల్గొన్నారు.

Next Story