కుండ పగిలి పోయింది ఇక ఇంటికి వెళ్దాం పదండి..అమ్మ చితికి నిప్పు పెట్టిన ఐదేళ్ల బాలుడు

by Chintha Aamani |

క్షణికా వేషాలు, అనుమానాలు, అపోహలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి.

కుండ పగిలి పోయింది ఇక ఇంటికి వెళ్దాం పదండి..అమ్మ చితికి నిప్పు పెట్టిన ఐదేళ్ల బాలుడు
X

దిశ,శంకరపట్నం : క్షణికా వేషాలు, అనుమానాలు, అపోహలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. సమస్య పరిష్కారానికి సవాలక్ష మార్గాలు ఉన్న చావుని అంతిమ పరిష్కారంగా ఎన్నుకుంటున్నారు.కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య మండలంలో కలకలం రేపింది.తల్లి చనిపోవడంతో బాలుడు ఒంటరిగా మిగిలాడు. అమ్మ లేదని ఇక తిరిగి రాదని ఆ పసి హృదయానికి తెలియదు కుండ పగిలిపోయింది ఇక ఇంటికి వెళ్దాం పదండి అని ఆ బాలుని మాటలు చూపరుల హృదయాలను పిండేశాయి. తాడికల్ గ్రామానికి చెందిన అమ్మిగళ్ళ శ్రావ్య ఆరు సంవత్సరాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి గ్రామానికి చెందిన ధర్మ తేజ అనే యువకున్ని ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. సంసారంలో చిన్న చిన్న సమస్యలు అనుమానాలు రేకెత్తడంతో రెండు సంవత్సరాల నుండి తల్లి గారి ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య ఫోన్లో వాగ్వాదం చెలరేగగా సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లోనే ఉరి వేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకోగా బుధవారం స్వగ్రామం తాడికల్ లో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రావ్య కుమారుడు ఐదు సంవత్సరాల బాలుడు శ్రేయస్ నందన్ అమ్మ చితికి నిప్పు పెట్టే దృశ్యం చూపరుల హృదయాలను పిండేసింది.బెహరాన్ దేశంలో ఉన్న భర్త ధరమ్ తేజ్ కూడా అంత్యక్రియలో పాల్గొని పెద్ద ఎత్తున రోదించారు. నిండా 30 సంవత్సరాలు కూడా లేని శ్రావ్య ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Next Story