పోలీస్ స్టేషన్ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్నరు..

by Disha Web Desk 20 |
పోలీస్ స్టేషన్ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్నరు..
X

దిశ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట ఇరువర్గాల వారు ఘర్షణ పడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు, వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు కుటుంబ తగాదా కోసం పోలీస్ స్టేషన్ వచ్చిన, ఇరువర్గాల కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట కట్టెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని, ఆ ఇరుకుటుంబాలకు చెందిన మహిళలు శిఖ వెంట్రుకలు పట్టుకొని, ఒకరికొకరు పిడుగులు గుద్దుకుంటూ కట్టెలతో కొట్టుకున్న, కేశవపట్నం పోలీసులు స్పందించడం లేదని, వాహనదారులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చట్టాన్ని రక్షించే పోలీసులే పట్టించుకోకపోవడంతో ఆ ఇరు వర్గాలకు చెందిన మహిళలు, పురుషులు జాతీయ రహదారి పైన ఘర్షణ సృష్టించి, భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిపారు.

Next Story