రామగుండంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం : ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |   (  Updated:2023-10-17 11:01:24  IST  )

రామగుండం నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని సీఎం

రామగుండంలో  గులాబీ జెండా ఎగరడం ఖాయం : ఎమ్మెల్యే
X

దిశ, గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని సీఎం కేసీఆర్‌ పాలనే శ్రీ రామరక్షగా ప్రజలు భావిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాజిద్ ఖాన్ రామగుండం బీఆర్ఎస్ పార్టీ చేరికల కమిటీ సభ్యులు జాహిద్ పాషా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ పాలన పట్ల ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. సిఎం కేసీఆర్‌ సంక్షేమ పధకాలకు అకర్షితులై బీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్న రన్నారు.

Next Story