మాన‌వ‌త్వ‌మా నువ్వెక్క‌డ‌..?

by Nallavelli.Anjaneyulu |

త‌మ త‌ల్లిదండ్రులు ఉండ‌టంతో మాకు ఇల్లు అద్దెకు ఇవ్వ‌డం లేద‌ని జ‌గిత్యాల జిల్లా మెట్ ప‌ల్లి మండ‌లం చౌల‌మ‌ద్ది గ్రామానికి చెందిన మంజుల సోమ‌వారం ప్ర‌జావాణిలో విన‌తి ప‌త్రం అంద‌జేసింది.

మాన‌వ‌త్వ‌మా  నువ్వెక్క‌డ‌..?
X

దిశ‌, జ‌గిత్యాల క‌లెక్ట‌రేట్ : జ‌గిత్యాల జిల్లా మెట్ ప‌ల్లి మండ‌లం చౌల‌మ‌ద్ది గ్రామానికి చెందిన మంజుల సోమ‌వారం ప్ర‌జావాణిలో విన‌తి ప‌త్రం అంద‌జేసింది. 'త‌మ త‌ల్లిదండ్రులు వృద్ధులు కావ‌డంతో మాకు ఇల్లు అద్దెకు ఎవ్వ‌రు ఇవ్వ‌డం లేద‌ని, ఇల్లు అద్దెకు అడిగితే నువ్వు ఒక్క‌దానివే ఉంటే ఇస్తాం' అని అంటున్నార‌ని వాపోయింది. 'మా త‌ల్లిదండ్రుల‌కు నేనొక్క‌దాన్ని కావ‌డంతో వారి ఆల‌న‌, పాల‌న అన్ని నేను చూసుకుంటున్నాను' అని తెలిపింది. ద‌య‌చేసి ఇందిర‌మ్మ ఇల్లు ఇప్పించి.. మా త‌ల్లి దండ్రుల‌ను చూసుకోవ‌డానికి మ‌నోధైర్యం క‌ల్పించాల‌ని ప్ర‌జావాణిలో వేడుకుంది మంజుల‌.

Next Story