ఆ యువకుడి ఆలోచన పలువురికి ఆదర్శం

by Ratna Kumari |   (  Updated:2026-04-14 13:52:31  IST  )

మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గుర్రం రాజశేఖర్ గౌడ్ అనే ఉద్యోగి తన గ్రామ యువకులను పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలబెట్టాలనే సంకల్పంతో తన సొంత డబ్బులతో గ్రామంలో నిరుపయోగగంగా ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హల్ ను గ్రామస్తుల ఆమోదంతో ఆ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కుర్చీలు టేబుల్స్ వేసి గ్రంథాలయంగా మార్చాడు.

ఆ యువకుడి ఆలోచన పలువురికి ఆదర్శం
X

దిశ,శంకరపట్నం: శంకరపట్నం మండలంలోని పలు గ్రామాలలో ఓ వైపు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన గుర్రం రాజశేఖర్ గౌడ్ అనే ఉద్యోగి తన గ్రామ యువకులను పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలబెట్టాలనే సంకల్పంతో తన సొంత డబ్బులతో గ్రామంలో నిరుపయోగగంగా ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హల్ ను గ్రామస్తుల ఆమోదంతో ఆ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కుర్చీలు టేబుల్స్ వేసి గ్రంథాలయంగా మార్చాడు. అంతేకాదు.. మూడవ తరగతి నుంచి పదో తరగతి వరకు పిల్లలకు ఉపయోగపడే పలు రకాల పుస్తకాలను గ్రంథాలయంలో పొందుపరిచారు.

అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ గ్రంధాలయం పేరు తో ఆవిష్కరించి విద్యార్థుల విజ్ఞానానికి బాటలు వేశాడు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తాను పోటీ పరీక్షలకు 2018 లో సిద్ధమయ్యానని.. ఆ సందర్భంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. అలాంటి ఇబ్బందులు తన గ్రామ యువకులు, పిల్లలు ఎదుర్కోవద్దనే సంకల్పంతో గ్రంధాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సుమన్, ఉపసర్పంచ్ చింతం రాజేశం, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎగ్గని రమేష్, పాలకవర్గ సభ్యులు మల్లేశం,రవి అంబేద్కర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొజ్జ రాజయ్య,తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మానకొండూర్ నియోజకవర్గం అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్,మెరుగు సురేష్, పవన్ ,కొమురయ్య,హనుమంతు, సుధాకర్,రాజు,శంకర్,తిరుపతి, లింగస్వామి గ్రామస్తులు అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Next Story