- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
సింగరేణి కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, సింగరేణి ప్రాతినిధ్య కార్మిక సంఘం సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు.

సింగరేణి కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
-రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్
దిశ, గోదావరిఖని: సింగరేణి కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, సింగరేణి ప్రాతినిధ్య కార్మిక సంఘం సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. బుధవారం దుర్గా దేవి నవరాత్రోత్సవల్లో భాగంగా అర్జీ-1డివిజన్ పరిధిలోని జీడీకే-5 ఓపెన్ కాస్ట్ లోని అమ్మవారి ఆలయంలో నిర్వహించిన మైసమ్మ బోనాల జాతర, ప్రత్యేక పూజ కార్యక్రమాలకు అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ కు అమితమైన ప్రేమ ఉందని, కార్మిక శ్రేయస్సుకై చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్మికుల పక్షాన నిలిచి, ప్రభుత్వ సహకారంతో కార్మిక, కార్మిక కుటుంబాల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా ఐఎన్టీయూసీ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఉనికి కోసం పాకులాడుతూ, దురుద్దేశ్యంతో కొన్ని సంఘాలు చేస్తున్న అర్ధరహిత అనవసరపు ప్రచారాలను మేధావులైన కార్మిక వర్గం గ్రహించాలన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ కె.సదానందం, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ దాస్,డిప్యూటీ జనరల్ సెక్రటరీ జనగామ శ్రీనివాస్, గడ్డం కృష్ణ, ఎల్. ఆంజనేయులు, గుండేటి శ్రీనివాస్, తాటికొండ ఆంజనేయులు, బుచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






