మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-09 13:33:08  IST  )

మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, ధర్మపురి : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణ కేంద్రంలోని షాదీ ఖానాలో సోమవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ, ముస్లీం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. జగిత్యాల జిల్లాలో 590 మంది మహిళలు కుట్టు మిషన్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారని మంత్రి తెలిపారు. మొదటి విడతలో 590 మంది మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని మరి కొంత మందికి 99 రోజుల ప్రజాపాలన - ప్రణాళికల కార్యక్రమంలో అందజేస్తామన్నారు. జిల్లాలో మైనార్టీ రుణాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యంగా పారిశుధ్యం పెండింగ్ ఫైళ్ల అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. 99 రోజుల ప్రణాళికలో గ్రామ, పట్టణాలలో ఉన్న సమస్యలను పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

గల్ఫ్ బాధితులకు అండగా..

గల్ఫ్ బాధిత కుటుంబాలకు కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.ఉపాధి కోసం వివిధ దేశాలకు వెళ్లి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బం దులు పడుతున్నారని అలాంటి గల్ఫ్ బాధితుల ను ఆదుకో వడానికి ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేస్తుందని మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలోని 15మంది గల్ఫ్ బాధితులకు రూ.75 లక్షలు అందజేస్తు న్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మైనార్టీ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.

కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారని ప్రమాదవశాత్తు అక్కడ మరణిస్తే కుటుంబం ఇబ్బందులు పడుతుందని కలెక్టర్ అన్నారు. గల్ప్ బాధితులకు ఆదుకోవడానికి జిల్లాలో ఇప్పటి వరకు 250 మంది బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున అందజేశామని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి వృద్ధి సాధించాలని ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి మైనార్టీ మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Next Story