సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

by Elthuri vijay kumar |

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
X

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మల్లాపూర్ లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

దిశ, మల్లాపూర్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముప్పై ఒక కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులు, రూ.1,03,596 విలువైనవి, అలాగే 26 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్హులైన వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ పింఛన్లు అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజలను కల్లబొల్లి మాటలతో తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పూర్తిగా కోల్పోయిందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించి ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రమేష్ గౌడ్, ఆర్‌ఐ రాజేష్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story