- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిద్రలోనే మెడలోని బంగారు గొలుసు మాయం..!
by Ratna Kumari |
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది.

X
దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది. బాధితురాలు గ్రామానికి చెందిన బట్టు కనుకవ్వ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 1న రాత్రి ఇంటి ముందు ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న సుమారు 2.75 తులాల బంగారు గొలుసును కత్తిరించి అపహరించాడు. ఉదయం లేచి చూసినప్పుడు గొలుసు కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కోడిమ్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకీ కోసం విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోడిమ్యాల పోలీసులు మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎండాకాలం కారణంగా చాలా మంది ఇళ్ల ముందు ఆవరణల్లో నిద్రిస్తున్న నేపథ్యంలో ఇలాంటి చోరీలకు అవకాశం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story






