- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలి
by velandi.Saikiran |
వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలి... సమయపాలన పాటించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

X
దిశ, జగిత్యాల, రూరల్: వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలి... సమయపాలన పాటించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఔట్ పేషెంట్లలో వ్యాధి లక్షణాలు ఉంటే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయాలని ముందస్తుగా వ్యాధి నిర్ధారణ జరిగితే మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. రోగులకు మందులు అందుబాటులో ఉంచాలని వైద్యులకు ఆదేశాలు ఇచ్చారు. ఆస్పత్రిలో ఎంతమంది ఇన్ అవుట్ పేషంట్ వస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. ఈ తనిఖీలు ఆర్డిఓ మధుసూదన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్.జగిత్యాల రూరల్ మండల తహసిల్దార్. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Next Story






