- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీలర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి
రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు డిమాండ్ చేశారు.

దిశ,పెద్దపల్లి : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేషన్ డీలర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం శుక్రవారం సిరి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా హాజరైన రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర కమీషను పేరుతో కాలాయాపన చేయకుండా ఒకే కమీషన్ చెల్లించాలని, గతేడాది నుంచి రేషన్ షాపుల్లో మగ్గుతున్న దొడ్డు బియ్యాని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రూ.5వేల గౌరవవేతనం చెల్లించాలన్నారు. రేషన్ షాపులను మిని సూపర్ మార్కెట్లుగా గుర్తించి తక్కువ ధరకే నిత్యవసర సరుకులు అందుబాటులోకి తేవాలని, డీలర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, వే బ్రిడ్జీల ఏర్పాటు, కరోనాతో మరణించిన డీలర్ల కుటుంబానికి రూ.20లక్షలు పరిహారం చెల్లించాలని, అద్దె, కరెంటుబిల్లు, ఇతర ఖర్చులను ప్రభుత్వమే భరించాలని సూచించారు. ఎప్పటి కమీషన్ అప్పుడే జమ చేయాలని, హైద్రాబాద్ లో రేషన్ భవన్ నిర్మాణం కొరకు స్థలం కేటాయించాలని, అర్హతను బట్టి డీలర్లకు పదోన్నతులు కల్పించాలని రమేష్ బాబు కోరారు. అంతకు ముందు నూతన జిల్లా అధ్యక్షుడిగా మద్దెల నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా దొంకెన తిరుపతిగౌడ్ బాద్యతలు చేపట్టారు. ఈ సమావేశంలో నాయకులు రెడ్డిమల్ల హన్మాండ్లు, ఊక శేఖరరావు, చంద్రశేఖర్, పులిమామిడి లక్ష్మినారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, చిలగాని మోహన్, పోతరాజు రమేష్, భానుచందర్ రావు, వెంకన్న, భాస్కర్ రెడ్డి, సందీప్, నాగభూషణం పాల్గొన్నారు.






