- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైరు పేలి చెట్టును ఢీకొట్టిన కారు..!
by Ratna Kumari |
హనుమాన్ దీక్షపరులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ఘటన జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది.

X
దిశ, జగిత్యాల రూరల్ : హనుమాన్ దీక్షపరులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ఘటన జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ముందు వైపు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ అదుపు కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మాధపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఈ హనుమాన్ దీక్షపరులు కొండగట్టు అంజన్న స్వామి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






