ఉప సర్పంచుల మద్దతుతోనే ఫోరం అధ్యక్షుడు నియామకం

by Ratna Kumari |

మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు నియామకం వివిధ గ్రామాల ఉప సర్పంచ్ ల మద్దతు తోనే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిందని, గతంలో నియామకమైన వ్యక్తి కి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మండల ఎస్సీ సెల్ చైర్మన్ ఫాక్స్ డైరెక్టర్ మాతంగి అనిల్ అన్నారు.

ఉప సర్పంచుల మద్దతుతోనే ఫోరం అధ్యక్షుడు నియామకం
X

దిశ‌, గ‌న్నేరువ‌రం : మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు నియామకం వివిధ గ్రామాల ఉప సర్పంచ్ ల మద్దతు తోనే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిందని, గతంలో నియామకమైన వ్యక్తి కి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మండల ఎస్సీ సెల్ చైర్మన్ ఫాక్స్ డైరెక్టర్ మాతంగి అనిల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో దళిత నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సంఘాల జేఏసీ నాయకుడిని అని చెప్పుకొని దళిత జాతికి అవమానం జరిగిందని కల్లెపెల్లి శంకర్ చెప్పడం వాస్తవం కాదని, రామంచ స్వామి నియామకానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ల‌కు చెందినవారు ఫోరం ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫోరం అధ్యక్షులు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ సూచన మేరకు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులను ఎన్నుకున్న‌ట్టు తెలిపారు. అనవసరంగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ను కాంగ్రెస్ పార్టీ నాయకులను బదనాం చేయడానికి ప్రయత్నించొద్దని హితవు పలికారు. దళితుల సంక్షేమానికి కవ్వంపల్లి సత్యనారాయణ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. దళితులంతా ఐక్యంగా ఉండి జాతి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గువ్వల సత్యం, యస్వాడ ఉపసర్పంచ్ గువ్వల భాగ్యలక్ష్మి నరసయ్య, గోపాలపూర్ ఉప సర్పంచ్ బి శంకర్ నాయకులు మహంకాళి మల్లికార్జున్ ,మామిడిపల్లి అంజయ్య, న్యాత నరేష్ ,బట్టు శ్రీకాంత్ ,కావ్వంపెల్లి రమేష్, బండపల్లి మనోహర్, బామ్మల కృష్ణకుమార్, నరసయ్య ,నేత యాకుబ్ ,మామిడిపల్లి లక్ష్మణ్, వెదురు వినయ్ ,వెదర శంకర్, న్యాత శ్రీనివాస్, వడ్లకొండఎల్లయ్య, కంసాని రమేష్, మంకాల బాబు ,అరుణ్ పాల్గొన్నారు.

Next Story