ప్రమాదం అంచున ప్రయాణం.. గుంతల రోడ్డును బాగు చేయండి

by Ajay Maddhiboyina |

నరక ప్రాయంగా మారిన రహదారిపై ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సి వస్తుందని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతల రోడ్డును బాగు చేయాలని తంగళ్లపల్లి, ఇల్లంతకుంట రెండు మండలాల ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రమాదం అంచున ప్రయాణం.. గుంతల రోడ్డును బాగు చేయండి
X

దిశ, తంగళ్లపల్లి: నరక ప్రాయంగా మారిన రహదారిపై ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సి వస్తుందని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతల రోడ్డును బాగు చేయాలని తంగళ్లపల్లి, ఇల్లంతకుంట రెండు మండలాల ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.

వర్షాకాలం మరింత ప్రమాదకరం..

తంగళ్లపల్లి మండల కేంద్రం నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో నిండి పోయింది. లక్ష్మీపూర్, చీర్లవంచ, వెల్జీపూర్ మీదుగా ఇల్లంతకుంట వరకు ఈ రహదారి ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి నిత్యం ఈ రహదారి గుండా ప్రయాణం సాగిస్తున్నారు. రెండేళ్లుగా ఈ రోడ్డును పట్టించుకునే వారే కరువయ్యారని ఆయా మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో టెండర్ పూర్తయి మధ్య వరకు రోడ్డు పూర్తి చేసినప్పటికీ ఆ తర్వాత పనులను నిలిపి వేశారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరి ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు ప్రమాదాలకు గురై గాయాల పాలైన సంఘటనలున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణం సాగించాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. బైకులు, ఆటోలు బోల్తా పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story