అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల్లో ఉద్రిక్త‌త

by Ratna Kumari |

కరీంనగర్ లో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు ఏబీవీపీ నాయకులు తమ సంఘం జెండాలతో రావడాన్ని దళిత సంఘాలు అంబేద్క‌ర్ వాదులు బిసి సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల్లో ఉద్రిక్త‌త
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ లో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు ఏబీవీపీ నాయకులు తమ సంఘం జెండాలతో రావడాన్ని దళిత సంఘాలు అంబేడ్కర్ వాదులు బిసి సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జెండాలతో రావడంపై ఆగ్రహించిన దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిని అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా కాసేపు గందరగోళం సృష్టించ‌గా ఏబీవీపీ నాయకులు సవ్యంగా సాగుతున్న అంబేడ్కర్ జయంతి వేడుకలకు ఉద్దేశ పూర్వకంగా జెండాలతో వచ్చి అలజడి సృష్టించడం పై స్థానికులు అదికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు

Next Story