- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల డీ మార్ట్ లో ఉద్రిక్తత
జిల్లా కేంద్రంలోని డీ-మార్ట్‌లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు కస్టమర్ల మధ్య ఘర్షణకు దారి తీసింది.

X
దిశ, జగిత్యాల టౌన్ : జిల్లా కేంద్రంలోని డీ-మార్ట్‌లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు కస్టమర్ల మధ్య ఘర్షణకు దారి తీసింది. కోరుట్లకు చెందిన ఓ యువకుడు జగిత్యాలకు చెందిన ఓ యువతిని షాపింగ్ సమయంలో చేతి వేళ్లతో అసభ్యకరంగా సంకేతాలు చేస్తూ వేధించినట్లు ఆరోపిస్తూ అమ్మాయి తండ్రి, బంధువులు యువకుడి పై దాడి చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన డీ-మార్ట్ సిబ్బందితో కూడా వాగ్వాదం జరిగింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు గుమికూడిన ప్రజలను చెదరగొట్టారు. అనంతరం యువకుడి తో క్షమాపణలు చెప్పించారు.
Next Story






