రేపటి నుంచి మద్యం దుకాణాల టెండర్లు

by Elthuri vijay kumar |

తెలంగాణలో మద్యం దుకాణాల కాలపరిమితి మరో రెండు నెలల్లో ముగియనుండటంతో, 2025-27 గాను మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

రేపటి నుంచి మద్యం దుకాణాల టెండర్లు
X

రేపటి నుంచి మద్యం దుకాణాల టెండర్లు

ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షలు

మద్యం టెండర్లలో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ల కేటాయింపు

దిశ,ధర్మారం: తెలంగాణలో మద్యం దుకాణాల కాలపరిమితి మరో రెండు నెలల్లో ముగియనుండటంతో, 2025-27 గాను మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక గతంలో ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలుండగా, ఇప్పుడు దానిని రూ.3లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల టెండర్లకు సబంధించిన విధివిధాలను ప్రకటిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుండి మద్యం దుకాణాల టెండర్లకు అబ్కారీ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 18 వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. అక్టోబర్ 23న డ్రా పద్ధతి ద్వారా షాపులను కేటాయించనున్నారు. డ్రాలో షాపులు పొందిన వారు 23, 24 తేదీల్లో మొదటి ఇన్ స్టాల్ మెంట్ ట్యాక్సీని చెల్లించాలని ప్రకటించారు. ఇక మద్యం టెండర్లలో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను కేటాయించారు. ఆరు శ్లాబులుగా విభజించి, మద్యం అమ్మకాలకు లైసెన్స్ లను జారీ చేయనున్నారు. ఈ టెండర్లలో లైసెన్స్ లు పొందిన వారికి డిసెంబర్ 1, 2025 నుండి 30 నవంబర్ 2027 వరకు కాలపరిమితి నిర్ణయించారు.

Next Story