26 నుంచి మద్యం దుకాణాలకు టెండర్లు

by Elthuri vijay kumar |

మద్యం దుకాణాలు (A4) లకు 2025- 27 సంవత్సరానికి సంబంధించిన టెండర్ దరఖాస్తులు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 18 వరకు స్వీకరించనున్నారు.

26 నుంచి మద్యం దుకాణాలకు టెండర్లు
X

26 నుంచి మద్యం దుకాణాలకు టెండర్లు

దిశ, జగిత్యాల కలెక్టరేట్: మద్యం దుకాణాలు (A4) లకు 2025- 27 సంవత్సరానికి సంబంధించిన టెండర్ దరఖాస్తులు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 18 వరకు స్వీకరించనున్నారు. మద్యం దుకాణాల డ్రాను కలెక్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 23న తీయనున్నారు. దీనికి సంబంధించి జగిత్యాల జిల్లాలో గల 71 షాపులకు గానూ 14 గౌడ కులస్తులకు, 8 ఎస్సీలకు కేటాయించారు. ఇట్టి 22 షాపులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ , జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గౌడ, ఎస్సీ రిజర్వేషన్ల కోసం డ్రా తీయనున్నారు. వైన్ షాప్ అప్లికేషన్లు సెప్టెంబర్ 26 నుంచి తీసుకోనున్నారు. ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు రూ.3లక్షలు కాగా మద్యం దుకాణాల గడువు 2025-27 రెండు సంవత్సరాలకు ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఏ. సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ సీఐ సీహెచ్. రాజమౌళి, జగిత్యాల సీఐ వై.సర్వేశ్వరరావు, ఎస్ఐలు మేఘమాల, రాజేందర్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story