- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీ గుడ్ల విక్రయంపై టీచర్ తొలగింపు..
అంగన్వాడీ కేంద్రాలకు చెందిన గుడ్లు అక్రమంగా ఒక వైన్ షాప్ పక్కన ఉన్న సిట్టింగ్ షాపులో అమ్ముతున్న సంఘటనపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తీవ్రంగా స్పందించారు.

అంగన్వాడీ గుడ్ల విక్రయంపై టీచర్ తొలగింపు..
-సూపర్ వైజర్ కు షోకాజ్, సీడీపీఓకు మెమో..
-అంగన్ వాడీ గుడ్లు నల్లబజార్ కు కథనంపై కలెక్టర్ సీరియస్
దిశ,హుజురాబాద్ రూరల్ : అంగన్వాడీ కేంద్రాలకు చెందిన గుడ్లు అక్రమంగా ఒక వైన్ షాప్ పక్కన ఉన్న సిట్టింగ్ షాపులో అమ్ముతున్న సంఘటనపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో బాధ్యత వహిస్తూ, రంగాపూర్ అంగన్వాడీ-1 టీచర్ రాజమ్మను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సంఘటనకు సంబంధించి మరికొందరు అధికారులపైనా చర్యలు తీసుకున్నారు. గత వారం రోజుల క్రితం హుజురాబాద్ పట్టణంలో ఈ అక్రమ గుడ్ల విక్రయం వెలుగులోకి వచ్చింది. ఒక వైన్ షాప్ పక్కనే ఉన్న సిట్టింగ్ షాపులో, అంగన్వాడీ కేంద్రాల నుంచి రావాల్సిన గుడ్లను మద్యం తాగే వారికి 'స్టఫ్'గా విక్రయిస్తున్నట్లు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీల పోషకాహార అవసరాల కోసం ప్రభుత్వం సరఫరా చేసే ఈ గుడ్లను ఇలా అక్రమంగా విక్రయించడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.ఈ ఘటనపై మీడియాలో కథనాలు వచ్చిన వెంటనే, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దీనిపై విచారణకు ఆదేశించారు. ఆమె ఆదేశాల మేరకు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి వెంటనే రంగంలోకి దిగి పూర్తి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అక్రమాలన్నీ బయటపడ్డాయి. గుడ్లను సరఫరా చేయాల్సిన అంగన్వాడీ టీచర్ రాజమ్మ, వాటిని వైన్ షాపునకు విక్రయించినట్లు విచారణలో తేలింది.
విచారణ నివేదికను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి, ఈ సంఘటనను అత్యంత సీరియస్‌గా పరిగణించారు. అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం పేదలకు పోషకాహారం అందించడమే కానీ, వాటిని ఇలా అక్రమ వ్యాపారాలకు వినియోగించడం తీవ్రమైన నేరంగా ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆమె చర్యలను చేపట్టారు. అంగన్వాడీ గుడ్లను వైన్ షాపుకు విక్రయించిన రంగాపూర్ అంగన్వాడీ-1 టీచర్ రాజమ్మను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించారు.ఈ విషయంపై పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన సూపర్వైజర్ శిరీషకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో పర్యవేక్షించడంలో విఫలమైన సీడీపీఓ మరాఠీ సుగుణకు మెమో అందించారు.






