ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Nallavelli.Anjaneyulu |

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మల్లారెడ్డిపేట ఆంజనేయస్వామి దర్శనానికి వెళుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం కొద్దిసేపు పాత బస్టాండ్ లో కార్యకర్తలతో మాట్లాడారు.

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ , ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మల్లారెడ్డిపేట ఆంజనేయస్వామి దర్శనానికి వెళుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం కొద్దిసేపు పాత బస్టాండ్ లో కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేర బేగం, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డిలు ప్రభుత్వ విప్ కు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలలో ఆరు గ్యారెంటీలను ప్రజలలోకి తీసుకెళ్లాలని అన్నారు. విద్యుత్ బిల్లులు మాఫీ అయిన ఇంటి యజమానులకు ప్రభుత్వం అందజేసిన పత్రాలను వారికి అందజేసి ప్రభుత్వం చేస్తున్న 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ చార్జీల మాఫీ విషయాన్ని ప్రజలకు చేరవేయాలి అన్నారు. నెల రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఎల్లారెడ్డిపేటలో అత్యధిక స్థానాలు గెలిచినందుకు అభినందించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో సైతం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల, వేములవాడ లో విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన లబ్ధిదారులకు సహకారం అందించి పూర్తి చేయించాలని అన్నారు. రాజన్నపేట సర్పంచ్ కల్లూరి బాపురెడ్డి మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, నాయకులు మండే శ్రీనివాస్, షేక్ గౌస్, గిరిధర్ రెడ్డి, చెన్ని బాబు, మరి శ్రీనివాసరెడ్డి, గుర్రాల రాజు, గోగురి శ్రీనివాసరెడ్డి, నంది కిషన్, అంతర్పుల, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, బి పేట రాజు బాలరాజు పాల్గొన్నారు.

Next Story