Tehsildar Office : సుల్తానాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..

by Batti.Sumithra |

సుల్తానాబాద్ మండలంలో, పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Tehsildar Office : సుల్తానాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..
X

దిశ, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలంలో, పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ సుల్తానాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధ్రువీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు. మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంట తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Next Story