- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల ఆక్టివిటీస్ పై విద్యార్థులకు అవగాహన
పోలీసుల డైలీ డ్యూటీస్, రెగ్యులర్ ఆక్టివిటీస్ పై స్టూడెంట్స్ అవగాహన కలిగి ఉండాలని గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు

దిశ, యైటింక్లయిన్ కాలనీ: పోలీసుల డైలీ డ్యూటీస్, రెగ్యులర్ ఆక్టివిటీస్ పై స్టూడెంట్స్ అవగాహన కలిగి ఉండాలని గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు అన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి జీడీకే టూ టౌన్ పోలీస్టేషన్ లో శాంతినికేతన్, స్పందన, సింగరేణి స్కూల్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల పనితీరు, సాంకేతిక పరికరాల వినియోగం గురించి టౌన్ సీఐ ప్రసాద్ రావు విద్యార్థులకు వివరించారు. సిబ్బంది విధులు, బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే విధానం, విచారణ, సైబర్ వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలికల రక్షణకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సేవలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్సై అహ్మదుల్లా, పోలీస్ సిబ్బందిఎండి యాకూబ్, సిహెచ్.రాజయ్య, జే.వెంకటేష్, ఎన్.కళ్యాణ్, ఏం.కనకయ్య, ఏం పూర్ణ చందర్, సిహెచ్ రామచంద్రం, రాజ్ కుమార్, అఫ్రోజ్, ఏం.మల్లేశ్వరి, ఎం.శ్రీలత, కే.అనుష, వీ.అంజలి, స్కూల్ టీచర్స్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






