ఎస్సీ హాస్టల్ లో విద్యుత్ షాక్ తగిలి, విద్యార్థికి తీవ్ర గాయాలు

by velandi.Saikiran |   (  Updated:2025-10-23 15:45:55  IST  )

జగిత్యాల పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇమేష్ చంద్ర సోలార్ విద్యుత్ షాక్

ఎస్సీ హాస్టల్ లో  విద్యుత్ షాక్ తగిలి, విద్యార్థికి తీవ్ర గాయాలు
X

దిశ, జగిత్యాల రూరల్: జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ ఎస్సీ హాస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇమేష్ చంద్రపై ట్రాన్స్ ఫార్మ‌ర్‌ పేలి నిప్పురవ్వలు మీద ప‌డిన సంఘ‌ట‌న గురువారం చోటు చేసుకుంది. హాస్టల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ధరూర్ క్యాంప్ ఎస్సీ హాస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న కరీంనగర్ కు చెందిన ఇమేష్ చంద్ర తాను ఆరేసిన బట్టలను తీసుకునేందుకు బిల్డింగ్ పైకి వెళ్లాడు. ఆరేసిన బట్టలు తీసుకునే క్రమంలో వసతి గృహం బయట ఉన్నటువంటి ట్రాన్స్ ఫార్మ‌ర్‌ పేలి నిప్పు రవ్వలు విద్యార్థిపై ప‌డ్డాయి. దీంతో అత‌నికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన వెంటనే హాస్టల్ సిబ్బంది స్పందించి, జగిత్యాల ప్రధాన హాస్పటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు.

Next Story