పేకాట వ్యసనంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి దొంగగా మారిన డిగ్రీ విద్యార్థి

by Bhanu |

పేకాట వ్యసనానికి అలవాటు పడిన డిగ్రీ విద్యార్థి అప్పుల పాలై దొంగగా మారి జైలు పాలయ్యాడు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివిస్తుంటే వారు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పులు తీర్చలేక ఏమి తోచని స్థితిలో దొంగలుగా మారి జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు.

పేకాట వ్యసనంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి దొంగగా మారిన డిగ్రీ విద్యార్థి
X

దిశ, సుల్తానాబాద్ :పేకాట వ్యసనానికి అలవాటు పడిన డిగ్రీ విద్యార్థి అప్పుల పాలై దొంగగా మారి జైలు పాలయ్యాడు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివిస్తుంటే వారు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పులు తీర్చలేక ఏమి తోచని స్థితిలో దొంగలుగా మారి జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్లా రహదారిలో మామిడి పండ్లు అమ్ముతున్న ఓ మహిళ మెడలోని పుస్తెల తాడును దొంగలించి పోలీసులకు అడ్డంగా దొరికి జైలు పాలైన విద్యార్థి. సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ కథనం ప్రకారం గట్టేపల్లి శివారులోని మామిడి తోటను లీజుకు తీసుకున్న ఏలేని శ్రీనివాస్ తమ తోటలోనీ మామిడి పండ్లను శ్రీనివాస్ చెల్లి రామినేని రమ్య గత మే నెల 28వ తేదీన తోట సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో విక్రయిస్తుండగా, కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన కాల్వ రాజు ( 21 ) సం" అటుగా తన ద్విచక్ర వాహనంపై వెళుతూ ఒంటరిగా ఉన్న మహిళను గమనించి మామిడి పండ్లు కొనుగోలు చేస్తున్నట్లుగా వ్యవహరించి జనసంచారం లేకపోవడంతో మహిళ మామిడి పండ్లు తూకం వేస్తున్న క్రమంలో ఆమె మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడును అపహరించి ద్విచక్ర వాహనంపై పారిపోయినాడు.


రాజు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ పేకాట ఆడి దాదాపు లక్ష రూపాయల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో తమ గ్రామంలో ఏదైనా నేరానికి పాల్పడితే దొరికి పోతానని గతంలో పెద్దపల్లి లో సైతం ఓ మహిళ మెడలో రెండు తులాల బంగారు చైను ను దొంగలించిన అనుభవంతో సుల్తానాబాద్ శివారులో దొంగతనానికి పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు. రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఎస్సై ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ మహేందర్, కానిస్టేబుల్స్ రమేష్, రాజ్ కుమార్, అరుణ్ కుమార్ , వేణు, కాల్వ శ్రీరాంపూర్ కానిస్టేబుల్ సదానందం, పొత్కపల్లి ఏ ఎస్ ఐ రత్నాకర్, హెడ్ కానిస్టేబుల్ కిషన్, బృందంగా ఏర్పడి సిసి కెమెరాల సహాయంతో దొంగను పసిగట్టారు. ఆదివారం కోమండ్లపల్లి శివారులో సాయంకాలం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కాలువ రాజు పోలీసులను గమనించి అనుమానాస్పదంగా వ్యవహరించడంతో రాజును అదుపులోకి తీసుకొని విచారించగా దొంగలించిన పుస్తెల తాడును కరీంనగర్ లో విక్రయించేందుకు వెళుతున్నట్లుగా పేర్కొన్నాడని తెలిపారు. అదుపులోకి తీసుకున్న రాజును రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.




Next Story