పన్నుల్లో రాష్ట్రాలకు 60% వాటా కల్పించాలి

by Elthuri vijay kumar |

కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు 60% వాటా కల్పించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

పన్నుల్లో రాష్ట్రాలకు 60% వాటా కల్పించాలి
X

పన్నుల్లో రాష్ట్రాలకు 60% వాటా కల్పించాలి

పెట్రోల్, డీజిల్ పై దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు చేయాలి

-మాజీ మంత్రి జీవన్ రెడ్డి

దిశ, జగిత్యాల ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు 60% వాటా కల్పించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీ స్లాబులపై స్పందించిన జీవన్ రెడ్డి కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కొత్త జీఎస్టీ స్లాబ్ ల కారణంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గకుండా కేంద్రం ద్వారా వచ్చే వాటాలను పెంచాలని కోరారు. పొగాకు మాదకద్రవ్యాలను 40 జిఎస్టి స్లాబ్ లో చేర్చడంపై ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవన్న జీవన్ రెడ్డి లగ్జరీ ఉత్పత్తుల కేటగిరీలోకి రాని పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు ప్రతి ఒక్కరికి నిత్యవసరమని కాబట్టి వాటిని 18 జీఎస్టీ స్లాబ్ లో చేర్చాల్సిందిగా కోరారు. ఇప్పటికైనా జీఎస్టీ విషయంలో కేంద్రం వాస్తవాలను గ్రహించడం సంతోషకరమని నూతన స్లాబ్ ల అమలుతో ఇంతకాలం ప్రజలపై కేంద్రం పన్నుల భారం మోపినట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లే అని వ్యాఖ్యానించారు. ఇక వినియోగదారులు నష్టపోకుండా ఉండేందుకు ప్రతి వస్తువు పై గతంలో ఎంత రేటు ఉండేదో ప్రస్తుతం ఎంత మేరకు తగ్గించారని వంటి వివరాలతో ఆయా దుకాణాల ఎదుట బోర్డు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కొందరు ఓల్డ్ స్టాక్ పేరిట పాత పన్ను విధానం తో వినియోగదారుడి పై భారం మోపుతుండడం సరికాదన్నారు. జీ ఎస్ టి పన్నుల విధానంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story