ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభం

by Ratna Kumari |

ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 12 నుంచి ప్రీ ప్రైమరీ విభాగం ప్రారంభం కానున్నదని మండల విద్యాధికారి రామయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభం
X

దిశ‌, గ‌న్నేరువ‌రం: ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 12 నుంచి ప్రీ ప్రైమరీ విభాగం ప్రారంభం కానున్నదని మండల విద్యాధికారి రామయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మండలం లోని కాసింపేట, మైలారం యూపీఎస్, గన్నేరువరం పీస్ పాఠశాల కు ప్రీ ప్రైమరీ విభాగాలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ప్రతి పాఠశాలలో 25 మంది విద్యార్థుల ప్రవేశాలు జరిగేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. ఈ పాఠశాలల్లో ఒక ఇన్ స్ట్ర‌క్ట‌ర్ ఒక ఆయా పోస్ట్ భర్తీ చేయాల్సి ఉంటుందని అర్హులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ అర్హతతో పాటు డీఈడీ చేసిన స్థానిక మహిళ, ఆయా పోస్టుకు పదవ తరగతి ఉత్తీర్ణులైన మహిళ అర్హులని తెలిపారు. ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Next Story