- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై ప్రత్యేక నిఘా
by Ratna Kumari |
అనుమతి లేకుండా మట్టి తరలింపు పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లాలో అక్రమ మట్టి రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఎస్పీ మహేష్ బి. గీతే తెలిపారు.

X
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : అనుమతి లేకుండా మట్టి తరలింపు పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లాలో అక్రమ మట్టి రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఎస్పీ మహేష్ బి. గీతే తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు అక్రమ మట్టి రవాణాకు సంబంధించి మొత్తం 19 కేసులు నమోదు చేసి, 45 వాహనాలను(27 ట్రాక్టర్లు,11 తిప్పర్స్, 07 జేసిబి లు) సీజ్ చేసినట్లు వెల్లడించారు. అక్రమ మట్టి రవాణాపై పోలీసుల వరుస దాడులు కొనసాగిస్తూ కేసులు నమోదు చేయడం, వాహనాలను స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా పరిధిలో ఎక్కడైనా అక్రమంగా మట్టిని తరలించినా,తవ్వకాలు చేసినా, నిల్వ చేసినా సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు. గడిచిన వారం రోజులలో జిల్లావ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి, 3 టిప్పర్లను స్వాధీనం, వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్, బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి ఒక జేసీబీ, 4 ట్రాక్టర్లను స్వాధీనం, రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 2 టిప్పర్లు, 5 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్, వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Next Story






