పుంజుకున్న బీజేపీ, జోరు తగ్గిన బీఆర్ఎస్

by velandi.Saikiran |   (  Updated:2025-12-14 22:46:12  IST  )

పుంజుకున్న బీజేపీ జోరు తగ్గిన బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు ‘నోట్ల’ చికెన్, మద్యం, వంటనూనె, కల్లు , వాన కురుస్తోంద

పుంజుకున్న బీజేపీ, జోరు తగ్గిన బీఆర్ఎస్
X

దిశ బ్యూరో, కరీంనగర్ : రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నోటిపికేషన్ మొదలైన నుంచి రాజకీయ పార్టీల నేతలు పెద్దగా జోక్యం చేసుకోకపోయినప్పటికి ఆయా పార్టీలు బలపరచిన అభ్యర్థులుగా స్థానికంగా ప్రచారం చేసుకున్నప్పటికి స్థానిక పరిస్థితులు అభ్యర్థుల వ్యవహారశైలిని బట్టి ఈ సారి ఓటర్లు పార్టీలు అని చూడకుండా గ్రామాభివృద్జే ధ్యేయంగా స్థానిక సర్పంచులను గెలిపించుకోవడంతో ఓటర్లు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు

అడుగడుగునా ఏడతెగని ఉత్కంఠ..

సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసినప్పటికీ ఫలితాల వెల్లడిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పలు గ్రామాల్లో రాత్రి 9 అయినా ఫలితాలు ప్రకటించక పోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన రేకెత్తించింది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తిమ్మాపూర్ మండలం లో విడత పంచాయతీ ఎన్నికలు అడుగడుగునా తీవ్ర ఉత్కంఠకు దారి తీశాయి. మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం 6 గంటల వరకే సర్పంచ్ ఫలితాలు వెలువడగా ఆరు గ్రామాల్లో మాత్రం రాత్రి 9 గంటలు దాటినా కూడా అధికారులు ఫలితాలు ప్రకటించక పోవడం పట్ల ఆయా గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఆరు గ్రామాల్లోని ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఫలితాల కోసం ఎదురుచూశారు. మండలం లోని పొలంపల్లి, మొగిలిపాలెం, నుస్తులపూర్, మహాత్మానగర్, కొత్తపల్లి, రామకృష్ణ కాలనీ గ్రామాల్లో రాత్రి 10 గంటల సమయం అయినప్పటికీ ఫలితాలు వెలువడలేదు. దీంతో ఫలితాలకోసం జనం ఉత్కంఠగా ఎదురుచూశారు.

పలు గ్రామాల్లోరీ కౌంటింగ్

పోటీ చేసిన అభ్యర్థుల మధ్య కొద్ది ఓట్ల తేడాతో ఫలితాలు వెలువడటంతో పలుచోట్ల అభ్యర్థులు రీకౌంటింగ్ కు డిమాండ్ చేశారు. దీంతో అభ్యర్థుల కోరిక మేరకు అధికారులు రీకౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. దీంతో ఫలితాల వెల్లడికి తీవ్ర జాప్యం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని కొత్తపెల్లి, మహాత్మానగర్ గ్రామాల్లో అభ్యర్థుల మధ్య కొద్ది ఓట్ల తేడా మాత్రమే ఉండడం తో ఆయా గ్రామాల్లో అభ్యర్థుల కోరిక మేరకు అధికారులు రీ కౌంటింగ్ నిర్వహించారు .

సత్తా చాటుకున్న అధికార కాంగ్రెస్​

మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని బల నిరూపణ చేసుకున్న కాంగ్రెస్​పార్టీ రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో సైతం మెజార్టీ స్థానాలను గెలుచుకుని మరోమారు తన సత్తా చాటుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో వెనకబడ్డ పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి వరకు ప్రభుత్వం పల్లెల్లో విమర్శల వర్షం కురిపిస్తూ వచ్చారు. ప్రస్తుతం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలవడం కాంగ్రెస్​ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

పుంజుకున్న బీజేపీ

రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మరింత పుంజుకుంది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 98 స్థానాల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థులు పోటీ చేయగా సుమారుగా 28 గ్రామ పంచాయతీల వరకు బీజేపీ కైవసం చేసుకోవడంతో జిల్లాలో బీజేపీ పుంజుకున్న పరిస్థితి నెలకొంది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కటి రెండు గ్రామాలకే పరిమితమైన బీజేపీ ఈ సారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుని జిల్లాలో పుంజుకున్న పరిస్థితి నెలకొంది

జోరు తగ్గిన బీఆర్ఎస్

గత పదిసంవత్సరాలుగా జోరుమీద ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జోరు తగ్గింది. పది సంవత్సరాల పాటు ఎన్నిక ఏదైనా గెలుపు బీఆర్ఎస్ దే అన్న చందంగా సాగిన పరిస్థితి నెలకొనగా అధికారం కోల్పోయిన రెండు సంవత్సరాలకు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చతికిల పడ్డ పరిస్థితి నెలకొంది. గతంలో గ్రామ గ్రామానికి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసిన పార్టీ ప్రస్తుతం స్పీడ్ తగ్గడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.

Next Story