- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్షన్.. టెన్షన్..అభ్యర్థుల గుండెల్లో రైళ్లు
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమయి ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరి కొద్ది గంటల్లో తేలనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు 12 మున్సిపాలిటీల్లో ఓటరు ఎవరిని కరుణించాడో.. ఎవరిని తిరస్కరించాడో అభ్యర్థుల తలరాత మరికొన్ని గంటల సమయం లో తేలనుంది.

*ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు*
*12 మున్సిపాలిటీల్లో నేడే తుది తీర్పు*
దిశ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమయి ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరి కొద్ది గంటల్లో తేలనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు 12 మున్సిపాలిటీల్లో ఓటరు ఎవరిని కరుణించాడో.. ఎవరిని తిరస్కరించాడో అభ్యర్థుల తలరాత మరికొన్ని గంటల సమయం లో తేలనుంది. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు పగడ్బంది ఏర్పాట్లను చేపట్టారు. ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడించే విధంగా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు భద్రతను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు
నిఘా నీడలో కౌంటింగ్
కౌంటింగ్ సెంటర్ల వద్ద చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పట్టణాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. గుర్తింపు కార్డులు ఉన్న ఏజెంట్లను మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం లోపే తుది ఫలితాలను వెల్లడించే లా అధికారులు ఏర్పాట్లు చేశారు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ణీత సమయానికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గెలుపు ఓటముల పై ఉత్కంఠ?
మున్సిపల్ కార్పొరేషన్లు మున్సి పాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి కొద్ది గంటల్లో ఫలితాలు వెలుపడనున్న నేపథ్యంలో గెలుస్తామా.. లేదా అని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. దీంతో ఓటర్లు పరిచయస్తులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. అన్నా ఎవరికి అవకాశం ఉందంటూ సమాచారాన్ని రాబడుతూ గెలిచే అవకాశం ఉందా లేదా అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. గెలిస్తే ఎలా గెలవకపోతే పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధాన పార్టీల బీ ఫారమ్‌తో పోటీ చేసిన అభ్యర్థులకు ముందస్తుగా ఆయా పార్టీల నాయకులు ఎగ్జిట్ పోల్స్ సర్వేలతో గెలుపోటములను అంచనావేసుకుంటూ అభ్యర్థులు చేజారకుండా చర్యలు చేపడుతున్నారు
పుర పీఠం ఎవరిదో..
పుర పోరు ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనుండటంతో పురపీఠం ఎవరిని వరించనుందో అనే చర్చలు జోరందుకున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీలకన్న అభ్యర్థులే కీలకంగా ఓటింగ్ సరళి ఉండటం ఇప్పుడు రాజకీయా పార్టీల్లో సైతం ఆందోళ కలిగిస్తుంది దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులే కీలకంగా పుర పీఠం దక్కే అవకాశం ఉండటంతో చైర్మన్,మేయర్ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులపై ఓ కన్నేసి ఉంచారు. రాజకీయ పార్టీలు సైతం ఆరా తీస్తూ గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థుల కు టచ్ లోకి వెళ్తూ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రాపంభించారు
పార్టీల క్యాంపు రాజకీయాలు
ప్రదాన రాజకీయ పార్టీలు గెలుపు ఓటములు పక్కన పెడితే ఇతర వ్యక్తులకు రాజకీయ పార్టీల చేతికి చిక్కకుండా అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తు ముందస్తు వ్యూహాలకు తెరలేపుతున్నాయి ఎవరెన్ని సీట్లు వస్తాయి అనేది స్పష్టత లేకపోయినా క్యాంపులకు తరలించడం రాజకీయాల్లో కలకలం రేపుతుండగా ప్రదానంగా ఇండిపెండెంటు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉండటంతో గెలిచిన అభ్యర్థులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటు ఆయా పట్టణాల్లో చర్చలు జోరందుకున్నాయి






