- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల కాంగ్రెస్‌లో ‘ఇంటి పోరు’
మున్సిపల్ పోరులో పైచేయి ఎవరిది? జగిత్యాల కాంగ్రెస్‌లో ‘ఇంటి పోరు’.. వర్గపోరుతో చీలనున్న ఓట్లు.. కింగ్ మేకర్‌గా మారనున్న ఇండిపెండెంట్లు! నేడే పోలింగ్..

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేడు జరగనున్న నేపథ్యంలో జగిత్యాల, హుజూరాబాద్ పట్టణాల్లో రాజకీయ వాతావరణం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. జగిత్యాలలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గాల మధ్య అంతర్గత విభేదాలు ‘ఇంటి పోరు’గా మారి ఓట్ల చీలికకు దారితీసేలా ఉన్నాయి. టికెట్లు దక్కని అసంతృప్త నేతలు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లుగా బరిలో నిలవడంతో, వారు ఇక్కడ కింగ్ మేకర్లుగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొనగా, మంత్రులు మరియు కీలక నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. అభివృద్ధి మంత్రంతో కాంగ్రెస్, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తుండటంతో ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు మున్సిపాలిటీల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
- దిశ, జగిత్యాల ప్రతినిధి/హుజూరాబాద్ రూరల్
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల మున్సిపల్ ఎన్నికల రాజకీయం యుద్ధాన్ని తలపిస్తోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గాల మధ్య వైరం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్చింది. బల్దియా పీఠంపై ఆధిపత్యం కోసం ఇరు నేతలు చదరంగంలో పావులు కదుపుతున్నారు. నేడు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, అభ్యర్థుల గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇరు వర్గాల నుండి ఇండిపెండెంట్ల మోత
మున్సిపాలిటీలోని 50 వార్డుల్లో మెజారిటీ సీట్లు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి దక్కగా, జీవన్ రెడ్డి వర్గం అసంతృప్తికి లోనైంది. దీంతో టికెట్లు దక్కని తమ అనుచరులను అధికారిక అభ్యర్థులపైనే ఇండిపెండెంట్లుగా బరిలోకి దించడంతో పోరు సంక్లిష్టంగా మారింది. సంజయ్ కుమార్ వర్గం నుండి కూడా కొందరు స్వతంత్రులుగా పోటీలో ఉండటంతో ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కలహాలు.. బీజేపీకి లాభం?
కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఇతర పార్టీలకు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఓట్లు భారీగా చీలితే బీజేపీ రెండంకెల స్థానాలు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎంఐఎం కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇండిపెండెంట్లు పెద్ద సంఖ్యలో గెలిస్తే, మున్సిపల్ పీఠాన్ని నిర్ణయించే 'కింగ్ మేకర్లు' వారే అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.






