- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీసీఐ పత్తి కొనుగోళ్లలో మోసం
సీసీఐ కొనుగోళ్లలో అధికారులు మామూళ్లు తీసుకోవడం రైతులను దోపిడీకి గురి చేస్తున్నాయి. సీసీఐ అధికారి ఒక బేలుకు రూ.500 చొప్పున మామూళ్లు తీసుకుంటున్నాడని, ఈ మామూళ్ల వసూలు పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సీసీఐ పత్తి కొనుగోళ్లలో మోసం
రైతులను నిలువు దోపిడీ చేస్తున్న
మిల్లర్లు, అధికారులు!
మామూళ్ల మత్తులో అధికారులు
సమగ్ర విచారణ జరిపించాలని
రైతులు, రైతు సంఘాల నాయకులు
దిశ, జమ్మికుంట : భారత పత్తి సంస్థ (సీసీఐ ) నిర్వహించే పత్తి కొనుగోళ్లలో అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు కుమ్మక్కై భారీ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పాత కాటన్ బేళ్లను కొత్త వాటిగా మార్చి అక్రమంగా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రైతు సంఘాల నాయకులు అందించిన వివరాల ప్రకారం.. పత్తి మిల్లుల యజమానులు మార్కెట్‌లో క్వింటాల్ పత్తిని రూ.5,000 నుంచి7,000 వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆ పత్తి నుంచి తయారుచేసిన పాత కాటన్ బేళ్లను ఇప్పుడు సీసీఐ అధికారుల సహకారంతో కొత్త బేళ్లుగా మార్చి ప్రభుత్వ కొనుగోలు ధరకు అమ్ముతున్నట్లు, మిల్లు యజమానులు పత్తి రైతుల నుంచి తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేసి సీసీఐకి అధిక ధరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో సీసీఐ అధికారుల ప్రమేయం ఉండటంతో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోంది.
అధికారులకు మామూలు
సీసీఐ కొనుగోళ్లలో అధికారులు మామూళ్లు తీసుకోవడం రైతులను దోపిడీకి గురి చేస్తున్నాయి. సీసీఐ అధికారి ఒక బేలుకు రూ.500 చొప్పున మామూళ్లు తీసుకుంటున్నాడని, ఈ మామూళ్ల వసూలు పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీసీఐ కొనుగోలు లో ఇంత దోపిడీ ఉందని తెలిసిన రైతులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రైతు సంఘాలు, రైతులు సీసీఐపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.ప్రజా సంఘాల నాయకులు అధికారులపై, మార్కెట్ కమిటీపై, మిల్లు యాజమాన్యంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘సీసీఐ కొనుగోలు చేసింది కొంత మాత్రమే , కొద్ది కాలంలోనే ఇంత భారీ మొత్తంలో పత్తి బేళ్లు రావడం ఏంటి? అసలు కొనుగోలు వివరాలు పారదర్శకంగా ఎందుకు ప్రకటించడం లేదు?’అని ప్రశ్నిస్తున్నారు. పత్తి మిల్లుల యజమానులు, సీసీఐ అధికారులు కలిసి చేస్తున్న అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు, మిల్లు యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.సీసీఐ కొనుగోలు చేసిన పత్తి వివరాలు, తూకాలు, మిల్లుల వివరాలను బహిరంగపరచాలని కోరుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తికి న్యాయమైన మద్దతు ధర దక్కకుండా అక్రమాలకు పాల్పడుతున్న సీసీఐ అధికారుల అవినీతిపై ఉన్నతాధికారులచే వెంటనే సమగ్ర విచారణ జరిపి, దోషులను శిక్షించాలని రైతు సంఘాలు మరియు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.






