శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు

by Ratna Kumari |

శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కోర్టు, సబ్ కోర్టు ప్రాంగణాల్లో బాంబ్ డిస్పోజల్ టీమ్, పోలీసు జాగిలాల తో (డాగ్ స్క్వాడ్) విస్తృత తనిఖీలు నిర్వహించారు.

శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు
X

దిశ, జగిత్యాల టౌన్: శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కోర్టు, సబ్ కోర్టు ప్రాంగణాల్లో బాంబ్ డిస్పోజల్ టీమ్, పోలీసు జాగిలాల తో (డాగ్ స్క్వాడ్) విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ స్థలాలు, కోర్టు పరిసరాలు అన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించారు. అనుమానాస్పద ఫ్యాకేజీలు, సంచులు, వస్తువులు, భద్రతకు ముప్పు కలిగించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల భద్రతను ప్రధానంగా ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ చర్యల్లో బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.

Next Story