- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం : ఎస్పీ అశోక్ కుమార్
దిశ, జగిత్యాల టౌన్: ర్యాగింగ్ చట్ట రిత్యా నేరమని ఎస్పీ అశోక్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా

దిశ, జగిత్యాల టౌన్: ర్యాగింగ్ చట్ట రిత్యా నేరమని ఎస్పీ అశోక్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. ర్యాగింగ్ చట్టరీత్యా తీవ్రమైన నేరమని విద్యార్థులకు సూచించారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్ దెబ్బ తింటుందని హెచ్చరిస్తూ, అలాంటి ఘటనలు జరిపితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. సీనియర్లు, జూనియర్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలని, భయపెట్టడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు, జైలు శిక్ష, కాలేజీ బహిష్కరణ, స్కాలర్‌షిప్ రద్దు, ఉద్యోగావకాశాల కోల్పోవడం వంటి తీవ్రమైన శిక్షలు ఉంటాయని వివరించారు. బాధితులు వెంటనే 100 నంబర్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారమివ్వాలని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరిస్తూ వాటి నుంచి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఎస్పీ యాంటీ ర్యాగింగ్ పోస్టర్లను ఆవిష్కరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, సీఐ కరుణాకర్, కాలేజ్ ప్రిన్సిపల్ సునీల్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






