- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్తను కరెంట్ షాక్ తో చంపేందుకు ప్రయత్నించిన అల్లుడు అరెస్ట్
అత్తను కరెంట్ షాక్ తో చంపేందుకు యత్నించిన ఆల్లుడు అరెస్ట్ అయిన ఘటన మండల పరిధిలోని జగదేవపేట గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, వెల్గటూర్ : అత్తను కరెంట్ షాక్ తో చంపేందుకు యత్నించిన ఆల్లుడు అరెస్ట్ అయిన ఘటన మండల పరిధిలోని జగదేవపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి(48) కి అదే గ్రామానికి చెందిన పద్మతో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొద్ది రోజుల నుంచి మల్లారెడ్డి-పద్మ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త పెట్టే హింసను భరించలేక పిల్లలను తీసుకొని తల్లి గడ్డం రాజవ్వ తన భార్య కాపురానికి రాకుండా చేస్తుందని.. అత్తను చంపితే భార్య తిరిగి ఇంటికి వస్తుందని భావించారు.
ఈనెల 10న రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో రాజవ్వ నివాసం వద్దకు వచ్చాడు మల్లారెడ్డి. రెండు ఇనుప రాడ్లకు కరెంట్ వైర్ పెట్టి.. ఆ వైర్ ను కరెంట్ పోల్ కి కనెక్షన్ ఇచ్చి రాత్రి లేచి తలుపులు తెరవగానే కాలు తగిలితే చనిపోయేలా పెట్టాడు. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు తలుపులు తీసి బయటికీ వచ్చేందుకు బయటికి వచ్చిన రాజవ్వ కాలుకు కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించింది. వెంటనే చుట్టు పక్కల వారిని పిలిపించి జరిగిన విషయాన్ని చెప్పింది. అనంతరం అల్లుడు మల్లారెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతని పై కేసు నమోదు చేసి.. దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితుడు మల్లారెడ్డిని రిమాండ్ కి తరలించినట్టు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.






