మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించండి

by velandi.Saikiran |

మిడ్ మానేరు నిర్వాసితుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్

మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించండి
X

దిశ, వేములవాడ టౌన్ : శ్రీ రాజరాజేశ్వరి జలాశయం (మిడ్ మానేరు) నిర్వాసితుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ బీజేపీ వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు ఇస్తామని హామీ ఇచ్చిన రూ.5లక్షల 4 వేలను వెంటనే ప్రకటించాలని, ఇండ్ల నష్టపరిహారం, పట్టా ప్యాకేజీలు రానివారితో పాటు యువతి, యువకులకు పట్టా ప్యాకేజీ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవరకు బీజేపీ పార్టీ పక్షాన పోరాడుతామని హెచ్చరించారు.

అంతకుముందు నంది కమాన్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు బిజెపి నాయకులు కార్యకర్తలు బైకులపై ర్యాలీగా తరలివచ్చి తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసి, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ విజయ ప్రకాష్ రావును కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్, కుమ్మరి శంకర్, ఏరెడ్డి రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రశాంత్, నర్సింగోజు శంకర్, మండల ఉపాధ్యక్షులు ఏరుగోక్కుల రమేష్ ,జింక శ్రీనివాస్, తిప్పరవేని రాజు, బిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆయా మోర్చాల అధ్యక్షులు గోనె భాస్కర్, నాంపల్లి అరవింద్, సీనియర్ నాయకులు అంజన్న యాదవ్, లక్ష్మణ్, నరసయ్య, భాను కార్యదర్శులు సంజీవరెడ్డి, మధు, బూత్ అధ్యక్షులు సురేష్, రాజు, నరసయ్య, ఆనందం, కంసాని రాము, రాము, రవి, శేఖర్, నాయకులు పూర్ణచంద్ గౌడ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, రాములు, ప్రశాంత్, మహేష్ యాదవ్, ప్రశాంత్, తిరుపతి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story