ఆరుగురు జూదరుల పట్టివేత

by Bhanu |

శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామంలో గురువారం జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

ఆరుగురు జూదరుల పట్టివేత
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామంలో గురువారం జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా గద్దపాక గ్రామంలో పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నట్లు తెలిసింది. రూ.8800 నగదును స్వాధీనం చేసుకొని జూదరులను కేశవపట్నం పోలీసులకు అప్పగించారు.


Next Story