KTR ఇలాఖాలో TRSకు షాక్.. ఈటల రాయబారంతో బీజేపీలోకి ముఖ్య నేత

by Disha Web Desk 4 |
KTR ఇలాఖాలో TRSకు షాక్.. ఈటల రాయబారంతో బీజేపీలోకి ముఖ్య నేత
X

దిశ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) ఎన్నికల రాజకీయం హీటెక్కుతుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెస్ పాలకవర్గాన్ని నామినేట్ చేయగా.. రెండు నెలలు గడువక ముందే కోర్టు అక్షింతలు వేసి ఎన్నికలు జరపాలని తీర్పు నివ్వడంతో.. ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే సిరిసిల్ల సెస్ ఎన్నికలను మరో మూడు నెలల్లో జరుపతామని కోర్టుకు విన్నవించిన నేపధ్యంలో సిరిసిల్లలో సెస్ ఎన్నికలను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్,బీజేపీ ప్రతిష్టాత్మంకగా తీసుకోనున్నాయి. ఈ ఎన్నికల రిజల్ట్ రాబోయే జనరల్ ఎన్నికల ఫలితాలపై పడనుండటంతో రెండు పార్టీలు ఈ సెస్ ఎన్నికలపై నజర్ పెట్టాయి. ఇప్పటి వరకు సిరిసిల్లలో తిరుగులేని పార్టీగా కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీకి వచ్చే సెస్ ఎన్నికలు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ సిరిసిల్ల సెస్ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారని సమాచారం.

సిరిసిల్ల టీఆర్ఎస్ లో సీనియర్ లీడర్, ఓ సామాజిక వర్గం సంఘం నేత ఈ మధ్య బీజేపీ నేతలతో కలిసి ఈటల రాజేందర్ ను కలిసినట్లు సమాచారం. ఈటల రాజేందర్ సైతం సదరు నేతతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వనించినట్లు తెలిసింది. సిరిసిల్లలో సీనియర్ టీఆర్ఎస్ నేతకు గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో విలువ ఇవ్వడం లేదని, మంత్రి కేటీఆర్ సైతం పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టి తన సత్తా చాటుకోవాలని, సెస్ పై బీజేపీ జెండా ఎగురవేసేందుకు వ్యక్తిగత ప్యానెల్ ను సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నోళ్ల వివరాలను బీజేపీ పార్టీ మండలాల వారీగా సేకరిస్తున్నట్లు సమాచారం. సిరిసిల్ల టీఆర్ఎస్ సీనియర్ నేత ఆధ్వర్యంలో బీజేపీలో భారీ చేరికలు ఉండబోతున్నట్లు తెలిసింది. ఈ రెండు మూడు నెలల వ్యవధిలో తన రాజకీయ జీవితంలో ఏమైనా జరగవచ్చని, ఈ సారి తాను ఎవరి మాట విననని, సెస్ ఎన్నికలకు, పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని, తాను సెస్ చైర్మన్ బరిలో ఉండబోతున్నట్లు బహిరంగగానే సదరు నేత చెప్పుకుంటున్నాడు.

సిరిసిల్ల సెస్ ఎన్నికలు టీఆర్ఎస్ కు అంత ఈజీ కాదు

సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి అంత ఈజీ కాదని రాజకీయంగా చర్చ కొనసాగుతుంది. టీఆర్ఎస్ నేతలు గత కొన్ని సంవత్సరాలుగా సెస్ చైర్మన్లుగా పాలకవర్గంలో కొనసాగుతున్నారు. వీరి హాయాంలోనే సెస్ నిర్విర్యం అయ్యిందని, అప్పుల పాలై సెస్ ఉనికి కొల్పోయిందని పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో తంగళ్లపల్లి మండల బీజేపీ నేత , మాజీ ఎంపీపీ రేగుల పాటి సుభాష్ రావ్ సెస్ చైర్మన్ గిరిపై దృష్టి సారించారు. గత జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా సుభాష్ రావ్​ సతీమణి బరిలో ఉండగా.. మంచి ఓట్లు సాధించారు. ఓడిపోయిన సానుభూతి కూడా ఉంది. ఆర్థికంగా బలమైన నేత కావడంతో సుభాష్ రావ్ సైతం సెస్ డైరక్టర్ల అభ్యర్థుల ప్యానెల్ పై దృష్టి సారిస్తున్నారు. బీజేపి గెలుపు కోసం టీఆర్ఎస్ నేతల సపోర్ట్ సైతం అంతర్గతంగా తీసుకోనున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో సెస్కు 11 డైరక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మేజార్టీ డైరక్టర్ స్థానాలు బీజేపి పార్టీ పరోక్షంగా నిలబెట్టే అభ్యర్థులకే అనుకూలమైన వాతవారణం కనపిస్తుండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటో ఎవరికి అంతు చిక్కడం లేదు. మాజీ సెస్ డైరక్టర్లు కొంత మంది ఇప్పటికే తమ ప్రచారాన్ని ప్రారంభించి విందు రాజకీయాలు షురు చేసినట్లు తెలిసింది. సెస్ ఎన్నికలు జరిగే 11 డైరక్టర్ స్థానాల్లో 7 స్థానాలు బీజేపి అభ్యర్థులకే గెలిచే అనకూల అవకాశాలు ఉన్నట్లు చర్చ కొనసాగుతుంది.

సెస్ ఎన్నికలు జరిగేనా..?

సిరిసిల్ల సెస్ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహిస్తామని, షెడ్యూల్ తేదీ సైతం ప్రభుత్వం కోర్టుకు విన్నవించిన నేపధ్యంలో.. అసలు ఎన్నికలు జరుగుతాయా...? లేదా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళతారా..? అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. ఏదో సాకుచెప్పి ఎన్నికలు వాయిదా వేసి.. కలెక్టర్ నే స్పెషల్ ఆఫీస ర్ గా కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సెస్ ఓటరు జాబితా విడుదల ఐతే కానీ సెస్ ఎన్నికలపై ఒక స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.

Also Read : కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు?

Also Read : బీజేపీ పాలిత రాష్ట్రాలపై నజర్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం?

Next Story

Most Viewed