- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిక్చర్‌లో బల్లి ఘటన..స్వీట్ హౌస్ యజమానిపై కేసు నమోదు
బాలాజీ స్వీట్ హౌస్‌లో విక్రయించిన మిక్చర్ ప్యాకెట్‌లో చనిపోయిన బల్లి కనిపించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్‌లో విక్రయించిన మిక్చర్ ప్యాకెట్‌లో చనిపోయిన బల్లి కనిపించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే సిరిసిల్ల టౌన్ పోలీసులు, దుకాణాన్ని తనిఖీ చేసి.. ప్రాథమిక విచారణ చేపట్టారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన గొడుగు అరుణ్ చంద్ మంగళవారం సాయంత్రం బాలాజీ స్వీట్ హౌస్‌లో మిక్చర్ ప్యాకెట్ కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి ప్యాకెట్ తెరిచి చూడగా అందులో చనిపోయిన బల్లి కనిపించిందని తెలిపారు.
ఈ విషయంపై వివరణ కోరేందుకు తిరిగి దుకాణానికి వెళ్లగా నిర్వాహకులు తనతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకుని బాలాజీ స్వీట్ హౌస్‌ను పరిశీలించారు. ప్రాథమిక విచారణ అనంతరం స్వీట్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. తనిఖీల సందర్భంగా టౌన్ సీఐ శ్రీనివాస్ వెంట ఎస్‌ఐ గణేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.






