- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రారంభమైన సింగరేణి మైన్స్ రెస్క్యూ పోటీలు
సింగరేణి రామగుండం 2 ఏరియా, రెస్క్యూ స్టేషన్ లో బుధవారం నుండి సింగరేణి 54వ జోనల్ స్తాయి మైన్స్ రెస్క్యూ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ప్రారంభమైన సింగరేణి మైన్స్ రెస్క్యూ పోటీలు
-11 ఏరియాల నుండి పాల్గొంటున్న 8 రెస్క్యూ జట్లు
-న్యాయ నిర్ణేతలుగా కేంద్ర గనుల రక్షణ డైరెక్టర్లు
దిశ, గోదావరిఖని: సింగరేణి రామగుండం 2 ఏరియా, రెస్క్యూ స్టేషన్ లో బుధవారం నుండి సింగరేణి 54వ జోనల్ స్తాయి మైన్స్ రెస్క్యూ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంస్థ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కే వెంకటేశ్వర్లు అధ్యక్షతన రెండు రోజులపాటు జరుగుతున్న రెస్క్యూ పోటీల కార్యక్రమానికి, ముఖ్య అతిధి, ముఖ్య న్యాయ నిర్ణేతగా కేంద్ర గనుల రక్షణ డైరెక్టర్ (డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ) ఉమేష్ ఎం. సావర్కర్, అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ రీజియన్-1 సౌత్ సెంట్రల్ జోన్ (హైదరాబాద్) హాజరై, ముందుగా మైన్స్ రెస్క్యూ జండా ఆవిష్కరించి, రెస్క్యూ సభ్యులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పోటీలకు సంభంచించిన డ్రా తీసి, పోటీలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇక సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల నుండి 2 మహిళా ఉద్యోగుల జట్లు, 6 పురుష ఉద్యోగుల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఇక ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మైన్స్ డైరెక్టర్లు మాట్లాడుతూ.. ఈ పోటీలు పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో
అత్యుత్తమ ప్రతిభ కనబరచిన సభ్యులను ఎంపిక చేసి, నాగ్ పూర్ లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి ఒత్తిడిలకు లోనూ కాకుండా, టిమ్ సభ్యులు తమ ప్రతిభను కనబరచాలని సూచించారు. సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ పోటీల్లో మొట్టమొదటి సారిగా మహిళా టీములు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా, ఈ పోటీలకు డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ మైనింగ్ డి. కిషోర్ కుమార్, డిడిఏంఎస్, (మెకానికల్) దిలీప్ కుమార్, డిడిఏంఎస్ (ఎలక్ట్రికల్) షేక్ నాగుల్ మీరా, డిడిఏంఎస్ (మైనింగ్) సనత్ కుమార్, డిడిఏంఎస్ (మైనింగ్) కే. ప్రేమ్ కుమార్, కమలేశ్ కుమార్ వర్మ డిడిఏంఎస్ (మైనింగ్), కోమల్ చౌదరి డిడిఏంఎస్ (ఎలక్ట్రికల్), అనికేత్ సింగ్ డిడిఏంఎస్ (మెకానికల్), సుదీర్ కుమార్ బొల్ల డిడిఏంఎస్ (మెకానికల్), లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ రెస్క్యూ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్.నాగేశ్వర్ రావ్ డిఎంఎస్ (హెచ్ఆర్.2), డా. జార్జ్ జాన్ ఏడిఏంఎస్ (ఓహెచ్) చింతల శ్రీనివాస్ జిఎం సేఫ్టీ కార్పోరేట్ సింగరేణి, సుధాకర రావ్ జనరల్ మేనేజర్ ఆర్జీ-3 ఏరియా సింగరేణి, రెస్క్యూ స్టేషన్ జనరల్ మేనేజర్ కె.శ్రీనివాస్ రెడ్డి, లలిత్ కుమార్ జనరల్ మేనేజర్ ఆర్జీ-1 ఏరియా సింగరేణి, మధుసూదన్ జిఎం సేఫ్టి ఆర్జీ రీజియన్ సింగరేణి, ఆర్జీ-2 ఏరియా అఫిషియేటింగ్ జీఎం ఏం.రాముడు, ఏఐటీయూసీ నాయకులు వైవి.రావ్, నర్సింహులు, జి.రవీందర్, సిఏంఓఏఐ నాయకులు ఆరేపల్లి శ్రీనివాస్, ఏరియా ఇంజినీర్ సుజన్ మెహ్రా, ఏరియా రక్షణ అధికారి ఎస్.సంతోష్ కుమార్, రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, డిజిఎం (పర్సనల్), అధికార ప్రతినిధి పి.అరవింద్ రావ్, డీజీఎం మురళీకృష్ణ, మెడికల్ ఆఫీసర్స్, ఇతర ముఖ్య అధికారులు, రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఈ పోటీలు జీడికే 7ఎల్ఇపి గనిలో జరుగుతున్నాయి. ఇక పోతే ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించిన టెస్ట్ లు మాత్రం మైన్స్ రెస్క్యూ స్టేషన్ లో జరుగుతాయని అధికార ప్రతినిధి పి.అరవింద్ రావ్ తెలిపారు.






