- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోటీలో ఉందామా..? వద్దా..? డైలామాలో అభ్యర్థులు

పోటీలో ఉందామా..? వద్దా..?
డైలామాలో కొందరు అభ్యర్థులు
గ్రామాల్లో సర్వే చేసుకుంటున్న పోటీదారులు.
విత్ డ్రాల కోసం ప్రయత్నాలు
తమకు పడే ఓట్లతో లెక్కలు
గెలుపులో కీలకం కానున్న యువత
దిశ, మంథని : స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇకా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఉపందుకుంది. దీంతో మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీల్లో ఒక్కసారిగా స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వేడి రగులుకుంది. ముఖ్యంగా నామినేషన్ వేసిన కొందరు సర్పంచ్ అభ్యర్థులు డైలామాలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఎలక్షన్ ల్లో ఖర్చు చేద్దామా..? వద్దా..? చేస్తే గెలుస్తామా..? లేదా..? పోటీలో ఉందామా..? వద్దా..? అని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది. ఓటర్లు తమకు అనుకూలంగా ఉన్నారా..? లేదా..? అని అంతర్మథనం చెందున్నారట. అయితే పోటీలో ఉన్న మరికొందరు అభ్యర్థులు అయితే... తమకు పోటీ ఉంటే ఓడిపోతామని ఓట్లు డైవర్ట్ అవుతాయోమనని పోటీలో అభ్యర్థులకు గాలాలు వేస్తూ విత్ డ్రా కోసం బుజ్జగించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.దీంతో గ్రామాల్లో అభ్యర్థులు ఎవరికీ వారె తమకు పడే ఓట్లు ఎన్ని..? పడని ఓట్లు ఎన్ని..? అని లెక్కలేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఓటర్లు ఉన్నారా..? లేదా..? అని సర్వేలు కూడా చేయించుకుంటున్నారు.
ఒక వేళ పోటీలో ఎంత ఖర్చు చేయాలి..? చేస్తే గెలుస్తామా..? లేదా..? అని ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.మరికొందరు అభ్యర్థులు ఎవరికీ వారె గెలుపు ధీమాగా ముందుకు వెళుతున్నారు. దీంతో గ్రామాల్లో స్థానిక పోరుతో రాజకీయ వేడి మొదలైంది. ముఖ్యంగా ఏ అభ్యర్థి గెలుపులోనైనా యువత పాత్రే కీలకం కానున్నట్లు తెలుస్తోంది. గ్రామ భవిష్యత్ కూడా యువత చేతిలో ఉందని స్థానిక ఓటర్లు చర్చించుకుంటున్నారు. మరో పక్క గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల గెలుపు పై రోజు రోజుకి గ్రామ వాతావరణం మారుతుంది.దీంతో గ్రామాల్లో ఓటర్ల నాడి అంతు చిక్కడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మరికొందరు అభ్యర్థులు ఎవరికీ వారే గెలుపు ధీమాగా ముందుకు వెళుతున్నారు. మరో పక్క గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల గెలుపు పై రోజు రోజుకి గ్రామ వాతావరణం మారుతుంది.దీంతో మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో ఓటర్ల నాడి ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.






