దిశ కథనానికి స్పందించిన శంకరపట్నం తహసీల్దార్

by samatah |

రీంనగర్ జిల్లా ,మానకొండూర్ నియోజకవర్గంలో, శంకరపట్నం మండలం, కేశవపట్నం గ్రామంలో గల ఎస్సీ బాయ్స్ హాస్టల్ విద్యార్థిని కుక్క కరవడంతో బుధవారం దిశ దినపత్రికలో,

దిశ కథనానికి స్పందించిన శంకరపట్నం తహసీల్దార్
X

దిశ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా ,మానకొండూర్ నియోజకవర్గంలో, శంకరపట్నం మండలం, కేశవపట్నం గ్రామంలో గల ఎస్సీ బాయ్స్ హాస్టల్ విద్యార్థిని కుక్క కరవడంతో బుధవారం దిశ దినపత్రికలో, వెబ్ లో, ఎస్సీ హాస్టల్ విద్యార్థి పై వీధి కుక్క దాడి అనే కథనానికి శంకర పట్నం తహాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు స్పందించారు. కేశవపట్నం సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి ,ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. తన క్షేత్రస్థాయి విచారణ వెళ్లడైన ప్రతి విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లక్ష్మారెడ్డి, వీఆర్ఏ ఇలియాజ్ తదితరులు ఉన్నారు.

Next Story